
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. తిరుపతిలోని SV మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 7 ఫిబ్రవరి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2025
- అపాయింట్మెంట్ ఆర్డర్: 24 మార్చి 2025
ఖాళీలు & ఉద్యోగ సంస్థ
ఈ ఉద్యోగాలు తిరుపతి ప్రభుత్వ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ లో ఉన్నాయి. మొత్తం 66 టెక్నీషియన్ & నాన్-టీచింగ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
- 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
- ఎటువంటి అనుభవం అవసరం లేదు.
దరఖాస్తు ఫీజు
- OC అభ్యర్థులు: ₹300
- BC, SC, ST, EWS, PWD అభ్యర్థులకు: ఉచితం
- ఫీజును SV మెడికల్ కాలేజీ, డెవలప్మెంట్ ఫండ్ పేరిట DD రూపంలో చెల్లించాలి.
వయస్సు పరిమితి
- కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 42 సంవత్సరాలు
- SC, ST, BC, EWS: 5 సంవత్సరాల వయస్సు సడలింపు
- PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాల వయస్సు సడలింపు
జీతం వివరాలు
- ఉద్యోగ ప్యాకేజ్ ₹15,000 – ₹32,570
- ఇతర అలవెన్సులు లేవు (కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు)
ఎంపిక విధానం
- రాత పరీక్ష & ఇంటర్వ్యూ లేదు
- మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
- అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- SV మెడికల్ కాలేజీ, ప్రిన్సిపల్, తిరుపతికి సమర్పించండి.
మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
Notificationpdf